స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం …అందుకే అంటూ రిమాండ్ రిపోర్ట్ రెడీ !

-

అగ్ని ప్రమాదం ఘటన పై నాలుగు పేజీల రిమాండ్ రిపోర్ట్ రెడీ అయింది. రమేష్ హస్పటల్ , స్వర్ణప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే.. అగ్ని ప్రమాదం జరిగిందని ఈ రిపోర్ట్ తేల్చింది. కోవిడ్ బాదితులకు చికిత్స అందజేయటానికి స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ హస్సటల్ తీసుకుందని, దీనికి సంబందించి రెండు యాజమాన్యాలు ఎమ్ఓయూ కుదుర్చుకున్నాయని రిపోర్ట్ లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ లోపాలు ఉన్నాయని…. రెండు యాజమాన్యలకు తెలుసని, కానీ వాటిని సరిచేయటానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని దానిని పట్టించుకొలేదని తేల్చారు.

fire
fire

దాని వల్లనే… అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. లోపాలు ఉన్నాయని తెలిసినా రమేష్ హస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ ను తెరిచిందని, ఫలితంగా పది చనిపోయారు…. 20 మంది గాయపడ్డారని రిపోర్ట్ లో పేర్కొన్నారు. విద్యుత్ లోపాలను సరిచేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, స్వర్ణ ప్యాలెస్ హోటల్ లోపాలు ఉన్నాయని తెలిసిన కోవిడ్ కేర్ సెంటర్ ను నడిపిన రమేష్ హస్పటల్ దే బాద్యతని రిమాండ్ రిపోర్ట్ తేల్చింది. ఎమ్ఓయూలు కుదర్చుకొవడంలో చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కొడాలి రాజగోపాల్ రావు, జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్ పాత్ర ఉందని తేల్చారు. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించటానికి ఎలాంటి భద్రత చర్యలు తీసుకొలేదని, ముగ్గురు నిందితులు బయటకు వస్తే… ఆధారాలను తారుమారు చేయడంతో పాటు పరారైయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news