Switzerland : ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ అదుర్స్‌

-

స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన తెలంగాణ పెవిలియన్ అందరినీ ఆకర్షిస్తోంది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్తో తెలంగాణ పెవిలియన్ సిద్ధం చేశారు. మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ కట్టడం చార్మినార్ ,పోచంపల్లి ఇక్కత్,మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్ ,స్కైరూట్ ఏరోస్పేస్ మొదలగు వాటితో డిజైన్ చేయబడిన వాల్ ఈ పెవిలియన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

’ఇన్ వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ వేదిక ఆకట్టుకుంటోంది. పెట్టుబడిదారులకు తెలంగాణ మంచి స్వర్గధామము అని ఆకర్షించే విధంగా ఉంది.’ పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ’ ’ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, ‘ అనే నినాదాలు పెవిలియన్కు స్వాగతం పలుకుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ సీఎం రేవంత్రెడ్డి హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి డేటా సైన్స్ జోడీ.. మొదలగు వాటితో దీనిపై ఇంగ్లీష్ కోట్స్తో ప్రదర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news