సంక్రాంతికి నల్ల చెరుకుని ఎందుకు వాడాలి..? అందుకే ఈ సంప్రదాయం వచ్చిందా..?

-

సంక్రాంతి పండుగ ఎంతో సరదాగా సాగుతుంది. పిల్లలు వాళ్ల పిల్లలు రావడం కలిసి ఆనందంగా జరుపుకోవడం ఇటువంటి అనుబంధాలు అన్నీ కూడా సంక్రాంతి నాడే కనపడుతూ ఉంటాయి. పైగా సంక్రాంతి అంటే అందరూ కలిసి చక్కగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. పిల్లలందరూ కలిసి ఆనందంగా సంక్రాంతి పండుగను చేసుకుంటారు.

భోగి మంటలు బసవన్నలు గాలిపటాలు హరిదాసు కీర్తనలు ఇలా సంక్రాంతి పండుగ మూడు రోజులు ఎంతో అద్భుతంగా సాగుతుంది. సంక్రాంతి ముందు వచ్చే రోజు భోగి. భోగి పండుగ నాడు పిల్లలకి భోగి పండ్లను పోస్తూ ఉంటారు. ఇలా పూర్వకాలం నుండి వచ్చిన పద్ధతుల్ని మనం ఆచరిస్తూ ఉంటాము. అయితే సంక్రాంతి రోజున నల్ల చెరుకుని కూడా వాడతారు చెరుకు లేకుండా పండగ పూర్తి కాదు. అసలు ఎందుకు చేరుకునే వాడాలి చెరుకు వలన మనకి ఏంటి లాభం..? ఎందుకు పూర్వీకులు దీన్ని తీసుకు వచ్చారు అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

చెరుకు లేనితే పండగ పూర్తి అవ్వద.. దాని ప్రత్యేకత ఇదే..

మకర సంక్రాంతి నాడు నల్లచెరుకుని ఉపయోగిస్తారు అలానే నువ్వులు బెల్లాన్ని కూడా పంచి పెడుతుంటారు. అలానే పండుగ నాడు గుమ్మడికాయతో చేసిన పులుసు, మినప గారెలు, నువ్వులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

సంక్రాంతి సమయంలో చెరుకు కూడా తినాలని సాంప్రదాయం. చెరుకుని ఎందుకు తినాలి అని పూర్వికులు పెట్టారు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. నిజానికి నువ్వులు బెల్లం ఇవన్నీ కూడా ఆరోగ్యనికి చాలా మంచిది. చెరుకు కూడా ఆరోగ్యానికి మంచిది. ఔషధ గుణాలు ఉంటాయి. ఈ కారణంగానే తినాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే సంక్రాంతి నాడు కచ్చితంగా వీటిని తినాలని అంటారు. గుమ్మడికాయ తినడం వలన మహిళలు మగవారిలో వంధత్వం రాకుండా వీర్యానికి సంబంధించిన సమస్యలు లేకుండా ఉంటుంది.

ఒక్కొక్కసారి మనం సాంప్రదాయలని చూసి చిరాకు పడుతూ ఉంటాము కానీ పెద్దలు ఏది ఊరికే చెప్పలేదు. ఆరోగ్యానికి సంబంధించి ప్రకృతికి సంబంధించి ఇలా వివిధ రకాల ప్రయోజనాలను మనం పొందడానికి అవుతుంది కాబట్టి పెద్దల మాటని అసలు తీసిపారేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news