2023 లో తెలంగాణలో టీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో మొదటిసారి బెంగుళూరును హైదరాబాద్ దాటిందన్నారు. నాలుగైదు నగరాలు తిరిగి వచ్చిన తర్వాత బిజినెస్ మెన్.. హైదరాబాద్ కు ఆకర్షితులు అవుతున్నారు.
రాష్ట్ర ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఉత్తరం వైపు ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో ఐటీ రంగంలో 40 వేల ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్ థ్రిల్ సిటీలో ఐటీ రంగ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
“మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ ఏర్పాటు చేశాం. దేశంలో ఐటీ ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ ముందుంటుంది. రాష్ట్రంలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తాం. పెట్టుబడుల కోసం హైదరాబాద్ అనువైన నగరం.” అన్నారు కేటీఆర్.