తండ్రితో టబుకు విభేదాలు ఉన్నాయా..?

-

సీనియర్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేటు వయసులో కూడా ఘాటుగా అందాలు ఆరబోస్తూ మరింతగా ఆకట్టుకుంటుంది. ఇటీవలే భూల్ భులయ్యా 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అంతకుముందు అలవైకుంఠపురం చిత్రంతో టాలీవుడ్ లో కూడా కంబ్యాక్ ఇచ్చి మరింత గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు, నాలుగు సినిమా ఛాన్సులు హిందీలో ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ తో తెరను పంచుకోవడానికి రెడీ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి రియా కపూర్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన కెరియర్ను దేదీప్యమానంగా కొనసాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తన వ్యక్తిగత విషయాలను.. చాలావరకు గోప్యంగానే ఉంచుతుంది. కుటుంబానికి సంబంధించిన విషయాలు ఆమె మీడియాతో పెద్దగా పంచుకోదు. వాటి గురించి అడిగినా సరే స్పందించడానికి ఇష్టపడదు. అయితే తాజాగా తన తండ్రికి సంబంధించిన ఒక అంశం తెరమీదకు రావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టబు తన తండ్రి ఇంటి పేరును ఉపయోగించుకోకపోవడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టింది. నా తండ్రి ఇంటి పేరు ఉపయోగించడం ముఖ్యమని నేనెప్పుడూ భావించలేదు.. నేనెప్పుడూ తబస్సుమ్ ఫాతిమా నే.. ఇది నా మధ్య పేరు. నాకు నా తండ్రి తో ఎలాంటి జ్ఞాపకాలు లేవు. నా సొంత సోదరి ఫరానాజ్ మాత్రం సందర్భానుసారంగా కొన్నిసార్లు ఆయనను కలుస్తూ ఉంటుంది. నేనైతే ఎప్పుడూ ఆయనను కలవాలనుకోలేదు.

నా జీవితంలో నేను మంచిగా స్థిరపడ్డాను. చాలా సంతోషంగా కూడా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. టబు తండ్రి పేరు జమాల్ అలీ హస్మి.. తల్లి పేరు రిజ్వానా.. టబూ బాల్యంలోనే వీరిద్దరూ విడిపోయారు అప్పటినుంచి టబు తన తండ్రిని కలవలేదు. ఇలాంటి కొన్ని వ్యక్తిగత కారణాలవల్లే తన వివాహ బంధానికి కూడా దూరంగా ఉంటోందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news