తెలంగాణ నూతన సీఎస్ గా కె.రామకృష్ణారావు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కొత్త సీఎస్ నియామకం కోసం ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది.
సీనియారిటీ జాబితాలో రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కొత్త సీఎస్ నియామకం కోసం ప్రభుత్వం కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. సీనియారిటీ జాబితాలో మరో ఆరుగురు అధికారులు పోటీలో ఉండగా.. వారి సమర్థత అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 1991 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రామకృష్ణారావును సీఎస్ గా ఎంపిక చేసింది. మరోవైపు సీఎస్ పదవీ నుంచి విమరణ తరువాత శాంతి కుమారికి కీలక బాధ్యతలు అప్పగించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వరనరుల అభివృద్ధి సంస్త వైస్ చైర్ పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. MCHRD డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.