హైటెక్ సిటీ మెడికవర్ ఆస్ప్రతిలో ఠాగూర్ మూవీ సీన్ రిపీట్.. రూ.4లక్షలు ఇస్తేనే!

-

హైటెక్ సిటీ మెడికవర్ ఆస్పత్రిలో ఠాగూర్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇప్పటివరకు రూ.3 లక్షలకు పైగా డబ్బు చెల్లించిన నాగప్రియ కుటుంబం. మరో రూ. 4 లక్షలు కడితేనే డెడ్ బాడీని ఇస్తామంటూ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోక్యం చేసుకున్న యాజమాన్యం బేఖాతర్ చేసింది.

రూ.3 లక్షల కడితేనే వైద్యం చేస్తామని, లేదంటే ఆపేస్తామంటూ గత రాత్రి కుటుంబీకులకు ఫోన్ కాల్ వచ్చినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయాన్నే రూ. లక్ష కట్టిన తర్వాత పేషెంట్ మృతి చెందినట్టుగా డాక్టర్స్ వెల్లడించినట్లు సమాచారం. వైద్యం ఆపేయడం వల్లనే నాగ ప్రియ చనిపోయింది అని బంధువులు ప్రధానంగా ఆరోపించారు. దీంతో మెడికవర్ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news