హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ లో తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఉదంతంలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నిందితుడు సురేష్ కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సంచలనం సంచలనం సృష్టిస్తోంది. విజయారెడ్డిని దారుణంగా హత్య చేసిన అనంతరం కాలిన గాయాలతో నిందితుడు సురేష్ తాపీగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
అబ్దుల్లాపూర్ మెట్ లోని తహసీల్దారు కార్యాలయం రోడ్డులోని ఓ భవనానికి ఏర్పాటు చేసిన కెమెరాల్లోని ఆ ఫుటేజి తాజాగా వెలుగు చూసింది. ఓ తహశీల్దార్ ను పెట్రోల్ పోసి కాల్చిన తర్వాత కూడా సురేశ్ చాలా సాదా సీదాగా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఎలాంటి ఆందోళన లేకుండానడిచి వెళ్లిన దృశ్యాలు ఆశ్చర‌్యం కలిగిస్తున్నాయి.
ఇదే సమయంలో హత్య జరిగిన తీరుపై కూడా పోలీసులు ఓ అంచనాకు వస్తున్నారు. సాధారణంగా సందర్శకులు తహసీల్దారు ఛాంబర్ లోకి వెళ్లినప్పుడు గడియ పెట్టరు. భోజనం చేసేటప్పుడు లేదా ఇతర ముఖ్యమైన అంశాలపై సిబ్బందితో చర్చించేటప్పుడు మాత్రమే గడియ పడెతారు. కానీ సురేష్ హత్య చేసే ఉద్దేశంతోనే లోపలికి వెళ్లగానే గడియ పెట్టినట్టు తెలుస్తోంది.
హత్య అనంతరం కూడా నిందితుడు సురేశ్ మంటలతోనే కార్యాలయం ముందు మార్గం నుంచి
కిందకు దిగాడు. చూసే వాళ్లకు పిచ్చోడని భ్రమపడేలా నిందితుడు సురేష్ దుస్తులు విప్పేస్తూ వెళ్లాడు. అందుకే ఘటన తర్వాత పోలీసులు వెంటనే బయలు దేరి వచ్చారు. ఆ సమయంలో సురేశ్ వారికి ఎదురైనా గుర్తించలేకపోయారు.