అమ్మో కూరగాయలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

-

ఈ కరోనా ఏమో గాని ఎటు నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి అర్ధం కావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దాని పని అది చేయడం ఇప్పుడు జనాలను తీవ్రంగా కలవరపెడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదోక రూపంలో దాడి చేయడం ఇపుడు ప్రజలకు కంటి మీద కునుకు ఉంచడం లేదు. తాజాగా 28 మంది కూరగాయల వ్యాపారులకు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో కరోనా సోకింది.

ఆగ్రా నగరంలోనే గత పదిరోజుల్లో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఆ కూరగాయలు ఎవరు కొన్నారు, వారు ఎక్కడ తిరిగారు, వాళ్లకు కరోనా ఉందా లేదా అనే దాని మీద చైన్ ని బ్రేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ వచ్చింది.

ఈ నేపధ్యంలో అధికారులు సూచనలు చేస్తున్నారు. కూరగాయాలు కొనే సమయంలో చేతి గ్లౌజులు వాడితే మంచిది అని, కూరగాయలు కొన్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో కడిగి కాసేపు ఆరబెడితే మంచిది అని సూచిస్తున్నారు. అలాగే కూరగాయలు కొనడానికి వెళ్ళిన సమయంలో క్యాష్ ఇవ్వకుండా ఆన్లైన్ లో చేసుకుంటే మంచిది అని హెచ్చరిస్తున్నారు. 28 మంది కుటుంబ సభ్యుల సహా 2000 మందిని క్వారంటైన్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news