స్మార్ట్ ఫోన్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి…!

-

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఏ స్థాయిలో ముఖ్యం అయిందో అందరికి తెలిసిందే. అది లేకుండా అసలు మనకు రోజు గడిచే పరిస్థితి లేదు. స్మార్ట్ ఫోన్ అనేది ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య ఇలా ఎన్నో రంగాల్లో కీలకంగా మారిపోయింది. ప్రపంచంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది రాజ్యమేలుతుంది అనేది వాస్తవం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన వ్యక్తిగత విషయాలను తనలో దాచుకుంటుంది.

పాస్వార్డ్; ఇది చాలా అవసరం… మన ఇల్లే కదా మన పిల్లలే కదా మన ఫ్రెండ్ ఏ కదా అని పాస్వార్డ్ చెప్పడం అనేది అంత మంచిది కాదు. ఎన్ని విధాలుగా చూసినా పక్క వారికి పాస్వార్డ్ చెప్పడం అనేది ఎంత మాత్రం మంచి విధానం కాదు. బ్యాంకింగ్, వ్యక్తిగత ఫోటోలు ఇలా ఎన్నో ఉన్న నేపధ్యంలో పాస్వార్డ్ చెప్పడం మంచిది కాదు.

లింక్స్; ఫోన్ కి వచ్చే అన్ని లింక్స్ కూడా క్లిక్ చేయడం అనేది ఎంత మాత్రం మంచి విధానం కాదు. చాలా మంది పది రూపాయల రీచార్జ్ వచ్చినా సరే కక్కుర్తి పడి లింక్స్ క్లిక్ చేస్తున్నారు. అది మీకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత సమాచారం మొత్తం తస్కరించే అవకాశం ఉంది.

యాప్స్; యాప్స్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే స్మార్ట్ ఫోన్ వస్తుంది. అది వస్తుంది ఇది వస్తుంది అని నోటిఫికేషన్ రాగానే… క్లిక్ చేస్తారు. ఇలా ఏవి పడితే అవి క్లిక్ చేయకుండా ఉండాలి.

వ్యక్తిగత సమాచారం; స్మార్ట్ ఫోన్ వరకు వ్యక్తిగత సమాచారం లేకుండా ఉంటేనే మంచిది. ఈ రోజుల్లో ఫోన్ హ్యాక్ అవ్వడం అనేది సాధారణంగా మారిపోయింది. కాబట్టి మీకు భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వ్యక్తిగత సమాచారం లేకుండా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news