గోల్డ్ లోన్ తీసుకుంటే.. కోవిడ్ ఇన్సూరెన్స్ ఫ్రీ..!

-

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. అందులో భాగంగానే చాలా మంది ప్ర‌స్తుతం ప‌ర్స‌న‌ల్ లోన్ల‌తోపాటు గోల్డ్ లోన్ల‌ను కూడా తీసుకుంటున్నారు. ప‌ర్స‌న‌ల్ లోన్లను ఇచ్చేందుకు కూడా ప‌లు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో అనేక మంది గోల్డ్ లోన్ల‌ను తీసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి వారి కోసం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

ముత్తూట్ ఫైనాన్స్‌లో కొత్త‌గా గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఉచితంగా కోవిడ్ ఇన్సూరెన్స్‌ను ఇస్తున్నామ‌ని ఆ కంపెనీ ప్ర‌క‌టించింది. ఇందుకు గాను ఆ కంపెనీ కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌తో భాగ‌స్వామ్యం అయింది. ముత్తూట్‌లో ఆయుష్ గోల్డ్ లోన్ స్కీం కింద రుణం తీసుకుంటే ఉచితంగా కోవిడ్ 19 ఇన్సూరెన్స్ పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఇన్సూరెన్స్ క‌వ‌రేజ్ ల‌భిస్తుంది.

క‌రోనా నేప‌థ్యంలో త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు స‌హాయం చేయ‌డం కోస‌మే ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని ముత్తూట్ తెలిపింది. బంగారం తాక‌ట్టు పెట్టి చాలా మంది లోన్ల‌ను తీసుకుంటున్నారని, అలాంటి వారికి ఈ ఇన్సూరెన్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version