ఉదయం పూట వీటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది..!

-

మనం తీసుకునే ఆహారం బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారం సమయంలో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది.

ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. అయితే ఉదయం పూట ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసమే పూర్తిగా చూసేయండి.

నట్స్:

మీయొక్క రోజుని నట్స్ తో మొదలు పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అలానే హృదయ సంబంధిత సమస్యలని మీ దరి చేరకుండా చూసుకుంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. అలానే ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. నట్స్ లో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక మీ యొక్క రోజుని నట్స్ తో మొదలు పెడితే చాలా మంచిది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ కూడా ఆరోగ్యకరమైనది. మీరు టీ కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. మెదడుని కూడా ఇది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.

ప్రోటీన్ షేక్స్:

చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ మనకి అందుబాటులో ఉంటాయి. సోయి మరియు పీ ప్రోటీన్స్ ఇలా వివిధ రకాలు మనకు దొరుకుతాయి. వీటిని కూడా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ప్రోటీన్ షేక్ లో పండ్లు, నట్ బటర్ లేదా గింజలు వంటివి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

పండ్లు:

పండ్లు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటిలో విటమిన్స్, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయాన్నే పండ్లు కూడా తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version