తెలంగాణలో థియేటర్లు బంద్.. మంత్రి తలసాని క్లారిటీ !

-

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమయ్యారు సినీ ప్రముఖులు. ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ వస్తుందని ప్రచారం జరుగుతోందని.. అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు రిలీజ్ కావాల్సి ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని… టిక్కెట్ ధరలు, 5వ షో లాంటి విషయాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పారు. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడొద్దని పేర్కొన్నారు.

అపోహలు నమ్మొద్దని… సినిమాల మూసివేత, 50శాతం ప్రేక్షకులు అని చెప్పడం తప్పు అన్నారు తలసాని. సినిమా థియేటర్లు మూసివేసే సమస్యే లేదన్నారు. ప్రజలు సినిమాలు థియేటర్లలో చూడండి.. అన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ఉందని హామీ ఇచ్చారు. టిక్కెట్ ధరల పెంపు అంశం పెండింగ్ లో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి టిక్కెట్ ధరల పెంపుకు ఫుల్ స్టాప్ పెడతామనీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version