60 లక్షల సైన్యం ఉంది.. మేం ఆలోచన చేస్తే బాగుండదు…ప్రతిపక్షాలకు తలసాని హెచ్చిరిక..

-

టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సైన్యం ఉంది.. మేం ఆలోచన చేస్తే బాగుండదని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే తాము అధికారంలో ఉన్నాము.. మా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సంయమనం పాటించాలి అని చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, కుటుంబ సభ్యులను, చిన్ని పిల్లలను రాజకీయంలోకి లాగడం మంచి పద్దతి కాదన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని… తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. మతాల పేరుతో రాజకీయం చేసేది బీజేపీ పార్టీనే అని దుయ్యబట్టారు. ఈ దేశంలో యాగాలు చేయాలన్నా.. దేవాలయాలు కట్టాలన్నా.. కేసీఆర్ ను మించినోళ్లు ఉన్నారా.. అని ప్రశ్నించారు. యాదాద్రి దేవాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దతున్నాం అని ఆయన అన్నారు.

ఒకర నిరుద్యోగ దీక్ష అని, మరొకరు ఎర్రవల్లి పోతానని అంటున్నారని పోయి ఏంచేస్తారని ప్రశ్నించారు. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని నడిపించే ఐదారు  రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని.. కానీ కేంద్ర మాత్రం ఒక్క ప్రాజెక్ట్ ను కూడా తెలంగాణకు కేటాయించలేదని విమర్శించారు.  పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తి తెలంగాణలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత తరుణ్ చుగ్ గురించి అన్నారు. పంజాబ్ లో బీజేపీకి దిక్కు లేదని ..కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version