హిందువులకు 500 ఏళ్ల నాటి కల ఇప్పుడు నెరవేరుతుంది. అందుకే రామ మందిరం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయోధ్యలో దివ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతోంది. ప్రపంచం లోనే ఎత్తైన రామ మందిరం ఏదో తెలుసా..? ప్రపంచం లోనే ఎత్తైన రామ మందిరం మన ఇండియా లో లేదు. ప్రపంచం లోనే ఎత్తైన రామ మందిరం ఆస్ట్రేలియా లోని పెర్త్‌లో వుంది. ఇక ఆ ఆలయ వివరాలు చూస్తే.. సుమారు రూ.600 కోట్ల వ్యయం తో 721 అడుగుల ఎత్తు లో ఈ రామాలయాన్ని కడుతున్నారు.
150 ఎకరాల విస్తీర్ణం లో ద ఇంటర్నేషనల్ శ్రీరాం వేదిక్ అండ్ కల్చరల్ యూనియన్ ఆధ్వర్యంలో పెర్త్ లో ఈ టాలెస్ట్ రామ మందిరం సిద్ధం అవ్వబోతోంది. శ్రీరామ్ వేదిక్ కల్చరల్ ట్రస్ట్ డిప్యూటీ హెడ్ డాక్టర్ హరేంద్ర రాణా ఈ వివరాలను పంచుకున్నారు. భారీ ఎత్తున రామ మందిరాన్ని కడుతున్నట్టు ఆయన అన్నారు.