అలాంటి ఫోటోలు షేర్ చేస్తూ షాక్ ఇచ్చిన తమన్నా..!

-

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు సైతం ముందుగా తాము వివాహం చేసుకోబోయే విషయం గురించి తెలియజేయకుండా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత వారు.. తాము వివాహం చేసుకోబోతున్నామని తమ కాబోయే భర్తతో కొన్ని ఫోటోలు దిగి షేర్ చేసిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలా గడిచిన కొద్దిరోజుల క్రితం హన్సిక సోషల్ మీడియాలో తన వివాహ విషయం వైరల్ గా మారడంతో.. తాను వివాహం చేసుకోబోతున్నానని తన కాబోయే భర్తతో ఫోటో దిగి క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ తమన్నా కూడా ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ఇక గడిచిన ఒక ఇంటర్వ్యూలో పెళ్లికి నేను వ్యతిరేకిని కానని వీలు చూసుకొని వెడ్డింగ్ చేసుకొని పిల్లల్ని కంటాను అని కామెంట్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి తమన్నా పెళ్లి పై పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అలా వచ్చిన ప్రతిసారి ఈ ముద్దుగుమ్మ తన స్టైల్ లో సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవుతూనే ఉంది. కెరియర్ మొదలుపెట్టి ఇప్పటికి 15 సంవత్సరాలు పైనే అవుతోంది. ఇక తమన్నాతో పాటు సినీ కెరియర్ ని మొదలుపెట్టిన హీరోయిన్స్ సైతం వివాహం చేసుకొని అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇక తనకంటే చిన్నదైనా హన్సిక కూడా తను చేసుకోబోయే వారిని పరిచయం చేసింది. దీంతో తమన్నా అభిమానులు కూడా తమన్న గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందా అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ తమన్నా మాత్రం పెళ్లి విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా తమన్నా మెహందీ పెట్టుకున్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. దీనికి మొహండేటరి అని కామెంట్స్ చేసింది. దీంతో తమన్నా అభిమానులు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటూ ఆశ్చర్యంగా కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది తమన్న పెళ్ళికూతురు అయ్యింది కాబట్టి మెహందీ పెట్టుకుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ మెహందీ ఫోటోలపై తమన్న క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version