సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. అవాక్కైన ప్రయాణికులు

తమిళ నాడు సీఎం స్టాలిన్‌.. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ఎవరి అంచనాలకు అందని నిర్ణయాలతో.. ప్రజల్లో తన క్రేజ్‌ ను పెంచుకుంటున్నారు సీఎం స్టాలిన్‌. అయితే.. సంచలన నిర్ణయాలతో దూసుకెళతున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి ప్రజలను ఆకట్టుకున్నారు.

తమిళ నాడు రాజధాని… చెన్నై లో ని టీ నగర్‌ నుంచి కన్నగి నగర్‌ వరకు సిటీ బస్సు లో ప్రయాణించారు. అయితే… ముఖ్యమంత్రి స్టాలిన్‌ ని బస్సు లో చూసి ప్రయాణికు లు ఆశ్చర్య పోయారు. సీఎం స్టాలిన్‌ తో ఫోటోలు కూడా తీసుకున్నారు. బస్సు లో సౌకర్యాలపై స్టాలిన్‌ ఆరా తీశారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? ఏమైనా సమస్యలున్నాయా ? అని ఈ సందర్భంగా స్వయంగా ప్రయానికులను అడిగి తెలుసుకున్నారు సీఎం స్టాలిన్‌. కాగా.. తమిళ నాడు లో మహిళ లకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.