తమిళ టీవీ ఛానల్ రిపోర్టర్ దారుణ హత్య…!

తమిళ టీవి ఛానల్ రిపోర్టర్‌ మౌసన్‌ గంజాయ్ స్మగ్లర్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లో ఈ ఘటన జరిగింది.కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లోని ఓ ఇంటికి రమ్మని చెప్పిన స్మగ్లర్లు ఆ ప్రదేశానికి రాగానే దారుణంగా హత్య చేశారు. ఇటీవల గంజాయ్ స్మగ్లింగ్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ కబ్జాలపై స్టింగ్ ఆపరేషన్ చేశాడు మౌసన్.

ఈ విషయంలో కక్ష కట్టిన స్మగ్లరు జర్మలిస్ట్‌ను దారుణంగా హత్య చేశారు. మాట్లాడాలి రమ్మని చెప్పిన స్మగ్లర్లు అతడి పై కత్తితో దాడి చేశారు. ఇంకెవరైనా జర్నలిస్ట్‌ స్మగ్లింగ్ వార్తలు రాస్తే ఇదే గతి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అతని శరీరంపై 18 చోట్ల కత్తి పోట్లు ఉన్నాయ్. ప్రస్తుతం ముగ్గురు నిందితులు అదుపులో ఉన్నారు.