చెన్నై: పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి చివరకు మోసం చేయాలని చూసిన మాజీ మంత్రి జైలు పాలయ్యాడు. అంతేకాదు బెయిల్ తీసుకునేందుకు కూడా అనర్హుడయ్యారు. ఈ ఘటన చెన్నై నగరంలో జరిగింది. ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మణికందన్‌కు ఓ సినిమా నటితో 2017లో పరిచయం అయింది. అప్పటి నుంచి ఆమెతో చనువుగా ఉన్నాడు. మలేషియాలో వ్యాపారం చేద్దామని నమ్మించాడు. పెళ్లి చేసుకుందామని మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. మాయ మాటలు చెప్పి గర్భం కూడా తీయించాడు.
ఆ తర్వాత హింసించడం మొదలు పెట్టాడు. అలా చాలాసార్లు వేధించారు. చివరకు ఆమె మాజీ మంత్రి గారి వేధింపులు భరించలేకపోయింది. ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మాజీ మంత్రిపై పలు సెక్షన్ల కింత కేసులు నమోదు చేశారు. అయితే అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. బెయిల్ కోసం నానా ప్రయత్నాలు చేశారు. చివరకు కోర్టు సీరియస్ అయింది. మణికందన్ వేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూడు నెలలు గాలించిన పోలీసులు ఆదివారం మణికందన్‌ను అరెస్ట్ చేశారు.