అమ‌లాపాల్ కి సిగ్గులేదు..త‌మ్మారెడ్డికి బుద్దిలేదు!

2829

అమ‌లాపాల్ ఆడై అనే త‌మిళ సినిమాలో న‌గ్నంగా న‌టించి సంచ‌ల‌న సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఓ సౌత్ హీరోయిన్ ఇలా బ‌ట్ట‌లిప్పి పూర్తిగా న‌గ్నంగా న‌టించ‌డం ఇదే తొలిసారి. సెమీ న్యూడ్ గా గ‌తంలో చాలా మంది హీరోయిన్లు న‌టించారు గానీ! ఇలా ఒంటి మీద నూలుపోగు లేకుండా న‌టించ‌డం మాత్రం ఇదే ప్ర‌ధ‌మం. అదీ పెళ్లై విడాకులు తీసుకున్న అమ‌లా ఇలా సంచ‌ల‌నానికి తెర లేప‌డంతో మ‌రింత ఆస‌క్తి సంత‌రించుకుంటోంది. అందుకే ఆడై రిలీజ్ కు ముందు సంచ‌ల‌నాలు సృస్టిస్తోంది. నిజానికి ఇలాంటి పాత్ర‌లు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ గ‌ట్స్ అమ‌ల‌లో పుష్క‌లంగా ఉన్నాయ‌ని నిరూపించింది. టీజ‌ర్ లో త‌న ప‌నిత‌నాన్ని చూపించింది.

tammareddy bharadwaj Fair On amala paul

ఇక సినిమాని తెలుగులో ఆమె టైటిల్ తో ద‌ర్శ‌క‌, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా త‌మ్మారెడ్డ త‌న దైన శైలిలో అమ‌లాపాల్ పై స‌హా త‌న‌పై తాను విరుచుకు ప‌డ్డారు. న‌లైభై ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో ఎంతో మంది కొత్త హీరోయిన్ల‌ను చూసాను. ఇలాంటి షాక్ ఎప్పుడూ తిన‌లేదు. ఆమె పోస్ట‌ర్ లో క‌మ‌ర్శియాలీటి క‌నిపించింది. జ‌నాలు చూస్తారు డ‌బ్బులు వ‌స్తాయ‌న్న ఆలోచ‌న‌తోనే కొన్నా. సినిమా చూసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు ఈ క‌థ ఎలా రాసాడు? అనిపించింది. అత‌నికి బుద్ది ఉండి రాసాడా? అమ‌ల పాల్ కి బుద్దిలేక న‌టించిందా? అన్న సందేహం క‌లిగింది. ద‌ర్శ‌కుడిగా విజన్ వంద ర‌కాలుగా ఉంటుంది. హీరోయిన్ల‌ను ఎలాగైనా చూపించాల‌నుకుంటాడు.

కానీ అత‌నికి సౌక‌ర్యంగా ఉండే హీరోయిన్లు దొర‌క‌రు. కానీ అమ‌లాపాల్ అత‌నికి మించి ఆలోచించ గ‌ల్గింది. అందుకే ఇలా బ‌ట్ట‌లిప్పి న‌టించింది. అయినా కొంచెమైనా సిగ్గుండాలి. కానీ సినిమా చూసిన త‌ర్వాత ఆమెకు అస్స‌లు సిగ్గు అనేదే లేద‌ని అర్ధ‌మైంది. ద‌ర్శ‌క‌, హీరోయిన్లు ఇద్ద‌రికీ సిగ్గు బుద్ది లేదు. మ‌రి నిర్మాత బుద్ది ఏమైన‌ట్లు? సినిమా కొన్న నా బుద్ది గ‌డ్డి తిన్న‌ట్లా? అంటూ త‌న‌దైన శైలిలో బాణాలు సంధించాడు. చివ‌రిగా మ‌రోసారి అమ‌లాపాల్ కి సిగ్గ లేదు..నాకు బుద్ది లేక సినిమా తెలుగు రైట్స్ తీసుకున్నాన‌ని అన్నారు.