అమెరికాలో తెలుగు మహిళల క్రికెట్ పోటీలు…!!!!

-

అమెరికాలో ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉంటారు. తెలుగువారి జనాభాకి తగ్గట్టుగానే తెలుగు వారి ప్రాంతాలకి తగ్గట్టుగా అనేక తెలుగు సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తెలుగు సంఘాలు అన్నిటిలో తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) కి ప్రత్యేకైమన గుర్తింపు ఉంది. అమెరికాలో తెలుగు వారికి ఏ చిన్న ఆపద వచ్చినా సత్వరమే సమస్య తీర్చగలిగే వాలంటీర్ వ్యవస్థ తానాకి అసలైన బలం. ఇదిలాఉంటే తానా సంస్థ తమ సభ్యుల కోసం నెలాంతరం చివరిలో ఎదో ఒక కార్యక్రమంతో సభ్యులని ఉల్లాసపరుస్తుంది. ఈ క్రమంలోనే

తానా ఈ సారి అమెరికాలోని తెలుగు మహిళల కోసం క్రికెట్ పోటీలని నిర్వహిస్తోంది. ఈ పోటీలకి  తానా కుటుంభ సభ్యులు ప్రతీ ఒక్కరూ రావాలని ఆహ్వానం పంపింది. అంతేకాదు ఈ పోటీలకి సంభందించిన ఓ గోడ పత్రికని కూడా విడుదల చేసింది తానా. తానా విడుదల చేసిన ఈ పోస్టర్ లో క్రికెట్ టోర్నమెంట్ కి సంభందించిన వివారాలని పొందు పరిచారు. ఇదిలాఉంటే

 

తానా నిర్వహించే ఈ మహిళా క్రికెట్ పోటీలని ఎమేరల్ద్ ఫీల్డ్స్ లోగల డబ్లిన్ లో జరుపనున్నారు. జులై 19th ఉదయం 8 గంటలకి మొదలైయిన ఈ పోటీలు సాయంత్రం 8 వరకూ జరుగుతాయని తానా ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్ లని తిలకించడానికి  వచ్చిన వారికోసం ప్రత్యేకమైన ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు  చేశారు. ఈ పోటీలలో పాల్గొనదాల్చిన వారు తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ ప్రవీణ్ అంకం ని సంప్రదించవచ్చని తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news