ఎవరైనా భార్య పుట్టినరోజుకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? కొందరు బట్టలు కొనిస్తారు. మరికొందరు నగలు కొనిస్తారు. ఇంకొందరైతే భార్యకు ఓ ముద్దుపెట్టి ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది బంగారం అని ఐస్ చేస్తారు. కానీ ఢిల్లీ సీఎం ఆరవింద్ కేజ్రివాల్ తన భార్యకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? ప్రజల మనసు! ఔను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో ప్రజల మనసు గెలిచి భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చారాయన.
అరవింద్ కేజ్రివాల్ ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా.. ఈ విజయం మాత్రం చాలా ప్రత్యేకం. తన భార్య పుట్టినరోజునాడే ఎన్నికల ఫలితాలు వెలువడటం యాదృచ్ఛికమే అయినా.. ఈ విజయాన్ని తనకు భర్తడే గిఫ్ట్‌గా భావిస్తోంది కేజ్రీ సతీమణి సునీతా కేజ్రివాల్. తన జీవితంలో మరే పుట్టినరోజుకు ఇంతకంటే గొప్ప గిఫ్ట్ తీసుకోలేదని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేజ్రివాల్ చేసిన ప్రజాసంక్షేమ పనులే అయనను గెలిపించాయని, ఇది కేవలం కేజ్రివాల్ గెలుపు కాదని, ప్రజల గెలుపని సునీతా కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్‌పై ప్రత్యర్థి పార్టీలు చేసిన ఆరోపణలకు ప్రజలు గట్టి సమధానం చెప్పారన్న సునీత.. రాజకీయ నాయకులు ప్రజలకు ఉపయోగపడే అంశాలపై కాకుండా పనికిరాని విషయాలపై అసత్యపు ఆరోపణలు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.