స్కిన్ షో అంటే అందంగా కనిపించడం కాదు : తాప్సీ

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ఝుమ్మందినాదం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ… తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన మెరిసింది ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్పై కన్నేసింది.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇక అక్కడ కూడా తన హవా నడిపించండి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

గత కొన్ని రోజుల నుంచి సినిమా షూటింగ్లు లేకపోవడంతో ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన తాప్సీ పన్ను.. ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా అందం అంటే మీ ఒపీనియన్ ఏంటి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా… స్కిన్ షో చేయడం అంటే అందం కాదు అని నా భావన అంటూ చెప్పుకొచ్చింది. తనకు బికినీ వేసుకోవడం కూడా ఇష్టం ఉండదని తన ఫ్యాన్స్ కూడా తాను బికినీ వేసుకోవాలని ఆశించరు అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news