నాగ శౌర్య సినిమా టైటిల్ ఇదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!?

Join Our COmmunity

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ హీరో నాగ శౌర్య కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే ఎన్నో విభిన్నమైన కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు ప్రస్తుతం నాగశౌర్య సినిమా వస్తుందంటే సినిమాలో కథ బలంగా ఉంటుందని అటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు అయితే ఇటీవలే తాను చేస్తున్న సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.

స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో నాగశౌర్య 20 చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విలువిద్య క్రీడకు సంబంధించిన అంశం తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే నాగశౌర్య కు సంబంధించిన సిక్స్ ప్యాక్ లుక్ అందరిని ఆశ్చర్యపరిచగా ఈ సినిమాకు టైటిల్ ఏంటి అన్న దానిపై గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాకు లక్ష్య అనే టైటిల్ ను పెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...