చరణ్ ఓసారి ఆలోచించుకో.. సలహా ఇచ్చిన తారక్..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో రామ్ చరణ్ కు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయినప్పటికీ… జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పోస్టర్ పోస్టర్ మాత్రం విడుదల కాలేదు అన్న విషయం తెలిసిందే.

అయితే అక్టోబర్ 22వ తేదీన రేపు మోషన్ పోస్టర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. అంతకుముందే రామ్ చరణ్ ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించిన ఒక చిన్న క్లిప్ ను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ… తారక్ గుర్తుపెట్టుకో నీలాగా నేను ఆలస్యం చేయను అంటూ కామెంట్ చేసాడు. వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే నువ్వు ఐదు నెలలు ఆలస్యం అయ్యావ్ బ్రదర్… అయినా ఒకటి గుర్తు పెట్టుకో… రాజమౌళి తో వ్యవహారం చివరి వరకు ఏదైనా జరగొచ్చు అంటూ కామెంట్ చేశాడు