సంక్రాంతి బరిలో రానా.. అభిమానులు రెడీ..?

-

ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు దగ్గుబాటి వారసుడు రానా. ఎన్నో వైవిధ్య త్మక సినిమాల్లో నటిస్తూ అందరిలో మరింత అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అడవిలో సంవత్సరాలపాటు జీవించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం అరణ్య . ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో రానా కనిపించడం అభిమానుల్లో మరింత అంచనాలు పెంచింది.

ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇక రానా హీరోగా నటిస్తున్న అరణ్య సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఏకంగా దగ్గుపాటి రానా స్వయంగా వెల్లడించడం అభిమానులందరికీ గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఇక హిందీలో హాతి మేర సాతి గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు హిందీతో పాటు తమిళ భాషలో కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. పర్యావరణ ఇతివృత్తంలో ఈ సినిమా రూపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news