టార్గెట్ ఈటల: కమ్యూనిస్టులకు ఆ సత్తా ఉందా?

-

ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఉమ్మడి ఏపీలో మంచి బలం ఉండేది.. అయితే రాష్ట్ర విభజన జరిగాక కమ్యూనిస్టుల ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఆంధ్రాలో సి‌పి‌ఎం, సి‌పి‌ఐ లాంటి పార్టీల హవా తగ్గిన సరే, తెలంగాణలో మాత్రం ఆ పార్టీలకు కాస్త పట్టు ఉండేది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు సత్తా చాటేవారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో కమ్యూనిస్టులు బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టి‌డి‌పిలతో పొత్తు పెట్టుకుని సత్తా చాటలేకపోయారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా కమ్యూనిస్టుల బలం తగ్గిపోయిందని అర్ధమైంది. అయితే జాతీయ పార్టీలుగా ఉండటంతో, ఆ పార్టీలు తెలంగాణలో నడుస్తున్నాయి. అలాగే ప్రజా సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కమ్యూనిస్టుల పోరాటాలకు ఇప్పుడు పెద్ద విలువ లేకుండా పోయింది…అసలు వారి పోరాటాలని ప్రభుత్వాలు కాదు కదా….ప్రజలే పట్టించుకొని పరిస్తితి.

మరి ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న కమ్యూనిస్టులు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ని ఓడించాలని ఫిక్స్ అయ్యాయి. హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటన కూడా ఇచ్చేశారు. అలాగే టి‌ఆర్‌ఎస్‌కు మద్ధతుగా ఉండనున్నారని కూడా అర్ధమవుతుంది. సరే కమ్యూనిస్టులు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తారనేది….వారి ఇష్టం.

కానీ హుజూరాబాద్‌లో ఈటలని ఓడించడానికి పనిచేయాలని రెడీ అయ్యారు. మరి ఈటలని ఓడించే సత్తా కమ్యూనిస్టులకు ఉందా? అంటే అసలు లేదంటే లేదనే చెప్పేయొచ్చు. హుజూరాబాద్‌లో సి‌పి‌ఎం, సి‌పి‌ఐ పార్టీలకు అసలు ఓటు బ్యాంకు లేదు. కనీసం ఒక వెయ్యి ఓట్లు తెచ్చుకోలేవు. హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి, ఇంతవరకు అక్కడ సి‌పి‌ఎం, సి‌పి‌ఐలు గెలిచిన దాఖలాలు లేవు. మరి అలాంటప్పుడు వీరు ఈటలని ఓడించడం అతిశయోక్తే అని చెప్పొచ్చు. అసలు ఈటలపై కమ్యూనిస్టుల ప్రభావం ఏ మాత్రం పడదనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version