కేసీఆర్‌పై ఉన్న ప్రజాగ్రహం భాజపా పాదయాత్ర ద్వారా బయటకు వస్తోంది : తరుణ్ చుగ్

-

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై కేసీఆర్‌కు విశ్వాసం లేదని అన్నారు. ప్రజా ఆందోళనలు ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. భాజపా ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ కుమార్‌లపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంగ్రామ యాత్రను ఆపేందుకు తెరాస శతవిధాలా ప్రయత్నం చేస్తోందని అన్నారు.

” కేసీఆర్‌పై ఉన్న ప్రజా ఆగ్రహం ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బయటకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా విజయం సాధిస్తుంది. ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ కంగారుపడుతున్నారు. యాత్ర పై తెరాస దాడిని ఖండిస్తున్నాను. ప్రజా సంగ్రామ యాత్ర సజావుగా జరిగేలా చూడటం పోలీసుల బాధ్యత. తెలంగాణ రోడ్ల అభివృద్ధి వెనక కేంద్రం పాత్ర ఉంది. ఆగస్టు 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. తెలంగాణ ప్రజల గొంతుకను అమిత్ షా వినిపిస్తారు.”  – తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్

కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణకు విముక్తి లభించే మార్గాన్ని అమిత్ షా నిర్దేశిస్తారని తరుణ్ చుగ్ అన్నారు. ఆగస్టు 21న అనేక మంది ప్రముఖులు అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరబోతున్నారని తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పామన్న తరుణ్.. మునుగోడూలోనూ విజయపరంపర సాగిస్తామని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version