” కార్తికేయ 2″ టీం కి ప్రభాస్ స్పెషల్ విషెస్

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” కార్తికేయ 2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర సెంటర్లలోనూ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ జరిగింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో మాత్రం కార్తికేయ 2 కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ముఖ్యంగా చిత్రంలో నిఖిల్ నటనతో పాటు, బలమైన కధ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కార్తికేయ 2 చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కార్తికేయ 2 ప్రభాస్ హాష్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version