దిగ్గజ గాయని, భారతరత్న అవార్డ్ గ్రహీత లతా మంగేష్కర్ ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉన్నా… ఇంకా ఐసీయూలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్ డాక్టర్ ప్రతీత్ సమదానీ తెలిపారు. లతా మంగేష్కర్ మరో 10 నుంచి 12 రోజుల పాటు ఐసీయూలో ఉండనున్నారు. ఆమె ఆరోగ్యాన్ని వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న సింగర్ లతా మంగేష్కర్ ను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ చేరారు. కరోనాతో పాటు న్యమోనియాతో బాధపడుతున్నారు లతా మంగేష్కర్. దీంతో పాటు 92 ఏళ్లు ఉండటంతో వైద్యులు మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. లతా మంగేష్కర్ కరోనా బారి నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులతో పాటు యావత్ దేశం కోరకుంటోంది.
లతా మంగేష్కర్ 36 భాషల్లో దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడారు. శాస్త్రీయ సంగీతం నుండి సినిమా పాటల వరకు, గజల్స్ నుండి భజనలు మరియు పాప్ వరకు, మంగేష్కర్ వివిధ శైలులలో పాడారు.