టాటా స్కై కంపెనీ తన బింజ్ ప్లస్ ఆండ్రాయిడ్ సెట్ టాప్ బాక్స్ ధరను భారీగా తగ్గించింది. ఈ బాక్స్ ధరను ఏకంగా రూ.1వేయి వరకు తగ్గించింది. దీంతో ఈ బాక్స్‌ను ప్రస్తుతం వినియోగదారులు రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఇప్పటికే ఈ బాక్స్‌ను వాడుతున్న వారు మల్టీ టీవీ కనెక్షన్ కోసం దీన్ని రూ.2,499కే కొనుగోలు చేయవచ్చు.
కాగా ప్రస్తుతం తగ్గించిన ధరకే ఈ బాక్స్‌ను విక్రయిస్తున్నారు. ఈ బాక్స్ ద్వారా వినియోగదారులకు 8 ఓటీటీ యాప్‌లకు గాను 6 నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం, జీ5, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, సన్ నెక్ట్స్, హంగామా ప్లే, ఈరోస్ నౌ, షెమారూమీ యాప్ లకు 6 నెలల పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇక అమెజాన్ ప్రైమ్‌కు గాను 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తారు.
టాటా స్కై బింజ్ ప్లస్ సెట్ టాప్ బాక్స్ ద్వారా వినియోగదారులు ఒకేసారి లైవ్ టీవీలను చూడవచ్చు. అలాగే ఓటీటీ యాప్‌లలోని కంటెంట్‌ను వీక్షించవచ్చు. దీని వల్ల మల్టిపుల్ హెచ్‌డీఎంఐ పోర్టులకు మారాల్సిన పని ఉండదు. అలాగే 7 రోజుల పాటు క్యాచప్ షోస్‌ను వీక్షించవచ్చు.