బ్రేకింగ్: షార్ట్ రన్ పై పంజాబ్ ఫిర్యాదు

-

దుబాయ్‌ లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరిగిన ఐపీఎల్ 2020 మ్యాచ్ సందర్భంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (కెఎక్స్ఐపి) ఆన్- ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వివాదాస్పదమైన ‘షార్ట్-రన్’ కాల్‌ పై ఫిర్యాదు చేసింది. ఐసిసి మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కు ఈ ఫిర్యాదు చేసారు. “మేము మ్యాచ్ రిఫరీకి విజ్ఞప్తి చేసాము. ఐపిఎల్ వంటి ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో మానవ తప్పిదానికి స్థలం లేదని పంజాబ్ పేర్కొంది.

ఈ ఒక్క పరుగు మాకు ప్లేఆఫ్ బెర్త్‌ పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ అన్యాయమైన కాల్ తర్వాత నిబంధనలు సమీక్షించబడతాయని ఆశిస్తున్నామని పంజాబ్ సీఈఓ సతీష్ మీనన్‌ పేర్కొన్నారు. మ్యాచ్ సూపర్ ఓవర్‌లోకి వెళ్లేముందు, 19 వ ఓవర్ మూడో బంతిలో కగిసో రబాడా బౌలింగ్ చేసిన క్రిస్ జోర్డాన్‌ను ‘షార్ట్ రన్’ అని చెప్పడం, ఆ తర్వాత రిప్లై లో అది క్లియర్ గా కనపడటం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news