TCS ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని భార్య ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముంబైలో TCS కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్ గా పని చేస్తున్న మానవ్ శర్మ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నా భార్య నికితా శర్మ టార్చర్ భరించలేకపోతున్నా.. నేను ఒంటరిని అయిపోయాను అంటూ ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు మానవ్ శర్మ అనే ఉద్యోగి.
అయితే.. నికితా వివాహేతర సంబంధమే మానవ్ ఆత్మహత్యకు కారణమనే ప్రచారం జరిగింది.
భర్త ఆత్మహత్యపై స్పందించిన నికితా శర్మ తనను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. మానవ్ మద్యం సేవించి తనను కొట్టేవాడని ఆరోపించారు. పెళ్లికి ముందు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడనే విషయం మానవ్ కు తెలుసన్నారు. నా ఆవేదన వినండి అంటూ నికితా కూడా ఓ వీడియో రిలీజ్ చేశా రు.
TCS ఉద్యోగి ఆత్మహత్య.. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్న భార్య
ముంబైలో TCS కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్ గా పని చేస్తున్న మానవ్ శర్మ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
నా భార్య నికితా శర్మ టార్చర్ భరించలేకపోతున్నా.. నేను ఒంటరిని అయిపోయాను అంటూ ఉరి వేసుకునే ముందు సెల్ఫీ… pic.twitter.com/UYZXk6U8CI
— BIG TV Breaking News (@bigtvtelugu) March 1, 2025