బస్సు యాత్రలు కాదు…వైసీపీకి చివరికి మిగిలేది విమాన యాత్రలే అంటూ విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. గడప గడపలో వ్యతిరేకత వచ్చినట్టే.. బస్ యాత్రలోనూ వైసీపీకి వ్యతిరేకత రావడం ఖాయమని.. విమాన యాత్రలు చేయడం మినహా వైసీపీకి వేరే గత్యంరం లేదని చురకలు అంటించారు. టీడీపీని.. బీసీలను విడదీయడం ఎవ్వరి తరం కాదని.. టీడీపీ నుంచి బీసీలను విడదీయడం వైసీపీ వల్ల అస్సలే కాదని ఫైర్‌అయ్యారు.
టీడీపీ అంటేనే బీసీ.. బీసీ అంటేనే టీడీపీ అని.. బడుగులకు టీడీపీ ఎన్నో పథకాలు.. స్వయం ఉపాధి పథకాలు అందించింది.. వైసీపీ ఏం చేసింది..? అని ప్రశ్నించారు.
గత మూడేళ్లల్లో బీసీలపై ఎన్ని దాడులు జరిగాయో మంత్రి ధర్మానకు తెలుసా..? మంత్రి ధర్మాన మొన్నే కెబినెట్టులోకి వచ్చారన్నారు. గడప గడపకూ వ్యతిరేకత రావడం వల్లే బస్ యాత్ర చేపట్టారని.. టీడీపీకి సీన్ లేకుంటే వైసీపీకి ఎందుకంత భయం..?అని ఆగ్రహించారు. మేం ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో మాకు తెలుసని… పొత్తులు పెట్టుకునే బొత్స, ధర్మానలు మంత్రులయ్యారనే విషయం మరిచారా..? అని ప్రశ్నించారు.