ఊహించని మలుపు: “నందమూరి లక్ష్మీపార్వతి”కి టీడీపీ కేడర్ సపోర్ట్!

-

లక్ష్మీ పార్వతిని నందమూరి కుటుంబ వ్యక్తిగా ఒప్పుకోవడంలో ఏమాత్రం అంగీకారానికి రారు అంటు నందమూరి కుటుంబ సభ్యుల్లు, టీడీపీ నేతలు అనే మాట రాజకీయ, సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటుంది. ఎన్టీఆర్ – బసవతారకమ్మ మాత్రమే వారి అంగీకారం తప్ప ఎన్టీఆర్ – లక్ష్మీ పార్వతి అనేది వారికి ఏమాత్రం నచ్చని అంశమే! అయితే… తాజాగా లక్ష్మీపార్వతిపై టీడీపీ కేడర్ కు సానుభూతి పెరుగుతుందని.. ఆమెకు కూడా అనుకూలంగా వారు మారుతున్నారని చెప్పే సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది!

వివరాళ్లోకి వెళ్తే… తాజాగా నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో… రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు పడగొడుతున్నారని టీడీపీ రాజకీఅ రచ్చ షురూ చేస్తే… అవసరం ఉన్న చోట విగ్రహాలను పక్కకు మారుస్తున్నామే కానీ, వాటిని పడగొట్టాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలో.. తాజాగా తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని విగ్రహాన్ని వీలైనంత తొందర్లో పునఃప్రతిష్టించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సరిగ్గా ఇక్కడే ఒక కీలక ఆలోచన చేసింది!

ఎన్టీఆర్ అభిమానుల్ని శాంతింపజేసే క్రమంలో… స్థానిక వైసీపీ నేతలు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నారంట. ఇందులో భాగంగా… ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని మరో చోటుకు మార్చి అక్కడ నెలకొల్పే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లక్ష్మీపార్వతిని పిలుస్తామని చెబుతున్నారంట. దీంతో టీడీపీ నాయకులకు ఎక్కడ మండాలో అక్కడ మండిందని కామెంట్లు వినిపిస్తున్నాయి!

అయితే నేతలుగా ఉన్నవారికి ఈ అంశం మింగుడుపడకపోయినప్పటికీ… ఎన్టీఆర్ విగ్రహ పునఃప్రతిష్టకు లక్ష్మీపార్వతిని చీఫ్ గెస్ట్ గా పిలవడంలో సానుకూలంగానే స్పందిస్తున్నారంట స్థానిక టీడీపీ కేడర్! వెన్నుపోటు అనంతరం చంద్రబాబు వదిలేసినా.. వారసులు కూడా పెద్దాయనను ఒంటరిని చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పేరున్న ఆయనకు ప్రేమగా పలకరించే ఆత్మీయుడు కరువయ్యేలా పరిస్థితులు సృష్టించారు. ఆ సమయంలో అంతమంది సంతానంలో ఏ ఒక్క కొడుకూ కూతురు ఆయనతో పాటు ఉండని సమయంలో… చివరకు ఎన్టీఆర్ అనే మహానుభావుడు లక్ష్మీపార్వతి ఒడిలోనే కన్నుమూశారు. ఇంతకు మించిన అర్హత లక్ష్మీపార్వతికి ఏమి కావాలనేది ఎన్టీఆర్ అభిమానుల ప్రశ్నగా ఉందంట.

దీంతో… ఎన్టీఆర్ విగ్రహ పునఃప్రతిష్టకు లక్ష్మీపార్వతిని చీఫ్ గెస్ట్ అని ఫిక్సయిపోవచ్చని చెబుతున్నారంట స్థానిక వైకాపా నేతలు! మరి బాబు & కో ఈ విషయంపై ఎలా స్పందించబోతోందనేది ఆసక్తికరంగా మరింది! విభజించూ పాలించూ అనే సూత్రాన్ని నమ్ముకున్నవారికీ – అందరినీ కలుపుకుపోతూ జీవించాలనే సూత్రాన్ని నమ్ముకున్నవారికీ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో చివరికి గెలుపు ఎవరి సొంతమవుతుందో వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news