కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే..!

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను తాజాగా విడుదల చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ తో కలిసి మేనేఫెస్టో రిలీజ్ చేసారు.

సూపర్ సిక్స్ :

  • యువతకు 20లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి
  • స్కూల్ కి వెళ్లే ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000
  • ప్రతీ రైతుకు ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం
  • ప్రతీ మహిళకు రూ.1500 నెలకు (19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు వారికి)
  • ప్రతీ ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

సూపర్ సిక్స్ 2.0 :

ఇంటింటికి తాగునీరు, సౌభాగ్య పథం, క్రీడలు, డిజిటల్ లైబ్రరీలు, సామాజిక భద్రత పింఛన్లు పెంపు, బీసీ డిక్లరేషన్, మహిళా సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ,బీసీ, అగ్రవర్ణ పేదల సంక్షేమం, క్రిస్టియన్ల సంక్షేమం, వ్యవసాయం, విద్యత్ ఛార్జీలు నియంత్రించడం, మౌళిక వసతుల కల్పన, రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం, అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతీ జర్నలిస్ట్ కి ఉచిత నివాస స్థలం, న్యాయవాదులకు కీలక సదుపాయాలు వంటివి కల్పించనున్నట్టు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇవేకాకుండా ఇంకా ప్రతీ రంగానికి 5 నుంచి 10 చొప్పున మెరుగైన సౌకర్యాలు కల్పించేవిధంగా హామీలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news