సీఎం జగన్‌కు నారా లోకేశ్ కృతజ్ఞతలు

-

అమరావతి: మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా లేదంటే రద్దు చేయాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మూడు వారాల ఆందోళన, న్యాయపోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాల సెమిస్టర్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి పోటీ పరీక్షలు రాష్ట్రంలో జరగాల్సి ఉందని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతమైన ప‌రిస్థితుల్లో రోజు వారీ కరోనా పరీక్షల నిర్వహణ లక్ష దాడటంలేదని చెప్పారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో చాలా మంది చనిపోతున్న ఘటనలు జగనకు తెలియనివి కాదన్నారు. మే 2021 లో జరగాల్సిన ఆఫ్‌లైన్ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని కేంద్ర సంస్థలను ఆదేశించిందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మే‌లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నానన్నారు. జూన్ మొదటి వారంలో మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని నారా లోకేశ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news