టీడీపీ నేత వినోద్​ కుమార్​కు జీవిత శిక్ష

-

బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవిత కాల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సెక్షన్‌ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్‌ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గత ఏడాది భవానిపురంలో టీడీపీ నేత లైంగిక వేధింపులు తాళలేక అపార్ట్‌మెంట్ నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు జీవితకాల జైలు శిక్ష , రూ.3లక్షల జరిమానా న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు.

బాలిక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్​ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ కోసం వినోద్​ జైన్​ ఇంటిని సీజ్​ చేశారు. 2 నెలలు వినోద్​జైన్ బాలికను లైంగికంగా వేధించాడని పోలీసులు గుర్తించారు. దీంతో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక క్షోభతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. ఈ విషయాలు బాలిక సూసైడ్ నోట్ లో రాసిందని ఏసీపీ తెలిపారు. అపార్ట్ మెంట్ లిఫ్ట్​లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వినోద్ జైన్ వేధించేవాడని సూసైడ్​ నోట్​లో రాసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version