కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు తమ్ముళ్లు!

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకని ఒక సామెత.. అసలు వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు కొసర బ్యాచ్ కు ఎందుకొచ్చిన తుత్తర అనేది మ్యాటర్! ఇంతకూ ఈ ప్రస్థావన రావడానికి గల కారణం.. గీతం యూనివర్శిటీ భూముల ఆక్రమణ – గీతం యాజమాన్యం మౌనం – గీతం పీఆర్వో అర్ధంలేని ఆన్సర్లు – టీడీపీ నేతల హడావిడి! మరోపక్క ఆర్డీవో పక్కా క్లారిటీ!!

అవును… గీతం వర్శిటీకి సంబందించిన ఇంత హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే! దీని గురించి టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతం మామూలుగా లేదు. ఇక టీడీపీ నేతలైతే… టీడీపీ పార్టీ ఆఫీసుని కూల్చినంతకంటే ఎక్కువ హడావిడి చేస్తున్న పరిస్థితి! మరోపక్క ప్రభుత్వ అధికారులు క్లారిటీగా చెబుతున్న ఆక్రమణలు! ఇంతజరుగుతున్నా గీతం యాజమాన్యం మౌనాన్నే తమ బాషగా చేసుకున్నారు ఎందుకు? కొత్త అనుమానాలకు తావిస్తోన్న సందేహం .. ప్రభుత్వ వాదనలకు బలం చేకూరుస్తున్న అనుమానం!!

ప్రస్తుతం గీతం యూనివర్శిటీకి చైర్మన్ గా ఉన్న.. చంద్ర‌బాబు బామ్మ‌ర్ది, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు భరత్ ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించలేదు! ఈయన మౌనంఅగా ఉంటే తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు.. ఫలితంగా ప్రభుత్వ వాదనలో నిజం ఉంది.. గీతం యూనివర్శిటీ యాజమాన్యం ఈ పనులు చేసే ఉంటుంది అని ఫిక్సయిపోతున్నారు జనాలు! ఫలితంగా జగన్ ఏమి చేసినా అందులో కచ్చితంగా పక్కా లెక్క ఉంటుంది.. అందుకే అసలు యజమానులు మాట్లాడకుండా కూర్చుంటుంటే… కొసరు బ్యాచ్ మాత్రమే రాజకీయ హడావిడి చేస్తున్నారనే కామెంట్లకు బలం చేకూరుతుంది!

మరి ఇప్పటికైనా గీతం భరత్ ఈ విషయాలపై స్పందిస్తారా.. లేక కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లి తర్వాత బయటకు వచ్చి స్పందిస్తారా అన్నది వేచి చూడాలి!!