కొడాలి నానికి అదిరిపోయే షాక్…ట్విస్ట్ ఏంటంటే?

-

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పేరు చెబితే…మొన్నటివరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పేవారు…కానీ ఇప్పుడు కొడాలి నాని అడ్డా అని చెబుతున్నారు. ఎందుకంటే టీడీపీ కంచుకోటగా ఉన్న గుడివాడని కొడాలి తన సొంత అడ్డాగా మార్చేసుకున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి….గత రెండు పర్యాయాలు వైసీపీ తరుపున గెలుస్తూ వస్తున్నారు. అసలు ఇక్కడ నానికి టీడీపీ చెక్ పెట్టలేకపోతుంది.

నాని ఎప్పుడైతే టీడీపీని వదిలేశారో అప్పటినుంచి గుడివాడ ప్రజలు కూడా టీడీపీని వదిలేశారు. అందుకే వరుసగా అభ్యర్ధులని మార్చిన కూడా ఇక్కడ టీడీపీ గెలవలేకపోతుంది. అయితే ఈ సారి మాత్రం నానికి అదిరిపోయే షాక్ ఇస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎందుకంటే నాని మంత్రి అయ్యాక, టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. వరుసపెట్టి చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుపడుతున్నారు. ఇక నాని చేసే విమర్శలకు టీడీపీ నేతలు ఎలా కౌంటర్లు ఇవ్వాలో కూడా అర్ధం కావడం లేదు.

దీంతో నాని మీద ఆగ్రహంతో రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్ళు…నెక్స్ట్ ఎన్నికల్లో గుడివాడలో నానీని ఓడించాలని స్కెచ్ వేస్తున్నారు. ఎలాంటి పరిస్తుతుల్లోనైనా నాని గెలిస్తే మళ్ళీ టీడీపీకే ఇబ్బంది అని అనుకుంటున్నారు. అందుకే మొదట నుంచి టీడీపీ శ్రేణులు, నానీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే మరింతగా నానిపై ఫైర్ అవుతున్నారు. నాని ఒక బూతుల మంత్రి అని నెగిటివ్ ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని వల్ల గుడివాడ ప్రజలు నానికి దూరమవుతారని అనుకుంటున్నారు.

కానీ గుడివాడలో అలాంటి పరిస్తితి లేదనే చెప్పొచ్చు. ఇక్కడ ప్రజలు పూర్తిగా నానికే సపోర్ట్‌గా ఉంటున్నట్లు కనిపిస్తోంది. పైగా ఇక్కడ టీడీపీ ఇంకా వీక్ అయింది. టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరరావు అడ్రెస్ లేరు. దీని బట్టి చూస్తే గుడివాడలో నానికి షాక్ ఇవ్వడం టీడీపీకి అయ్యే పని కాదు. ఇంకా ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే….ఒకవేళ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి వీచినా సరే గుడివాడలో మాత్రం కొడాలిని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version