గజ్వేల్ కు రాకపోతే గుండు కొట్టించుకుంటా : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ కి ఎట్లా వస్తాడో చూస్తా అంటున్నారు.. వస్తా… వచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అని సవాల్ విసిరారు. “అడ్డంగా వచ్చినొడిని.. తొక్కుకుంటూ పోతా గజ్వేల్ రాకుండా పోతే … గుండు కొట్టించు కుంటా” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీళ్ళు జగన్ కి….ఉద్యోగాలు కెసిఆర్ ఇంటికి వెళ్లాయని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ దత్తత తీసుకుని నాలుగు ఏండ్లు అయ్యిందని.. కెసిఆర్ దత్తత తీసుకున్నా..ఈ ప్రాంతం లో కాంగ్రెస్ జెండా ఎగిరిందని తెలిపారు. ప్రజలను వంచించడానికి దత్తత తీసుకున్నారని.. కొంత మంది సన్నాసులు… అక్కడక్కడ ఫ్లెక్సీ పెట్టారని నిప్పులు చెరిగారు. మూడు చింతళ్ళపల్లి గ్రామములో 57 ఏండ్లు ఉన్న వాళ్లకు ఎంత మందికి ఇండ్లు ఇచ్చారని ప్రశ్నించారు. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇచ్చినవా ? నేను చెప్పింది అబద్దం అయితే… నేను రాజీనామా చేస్తా ?అని సవాల్ విసిరారు.

అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇచ్చినా..లక్ష ఋణ మాఫీ చేసినా.. పంచాయతీ పెడదామన్నారు. అన్ని కులాల పెద్దలను కూడా పిలిచి… చర్చ చేద్దామని కెసిఆర్ కు సవాల్ విసిరారు. పల్లె కనిపించని కుట్రల లో బంది అయ్యిందని.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని.. కానీ కెసిఆర్..పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్ష అప్పు పెట్టిండని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version