కడపలో సైకిల్ స్పీడ్.. ఫ్యాన్స్ బ్రేకులు వేస్తారా?

-

ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ దూకుడు బాగా పెరిగిన విషయం తెలిసిందే..ప్రస్తుతం అధికార వైసీపీపై కాస్త ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది…పైగా టీడీపీకి సపోర్ట్ గా ఉన్న అనుకూల మీడియా…ఓ రేంజ్ లో జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసే పనిలో పడింది..అలాగే టీడీపీని ఎప్పటికప్పుడు లేపుతూ వస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్తితులు వైసీపీకి పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. దానికి తోడు టీడీపీ నేతలు మునుపటి కంటే బాగా యాక్టివ్ అయ్యారు..ఎక్కడకక్కడ దూకుడుగా పనిచేస్తున్నారు.

అలాగే టీడీపీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో…కొందరు నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్య సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కొందరు సీనియర్లు టీడీపీలోకి వచ్చేందుకు రెడీ అయ్యారని కథనాలు వస్తున్నాయి. వీర శివారెడ్డి, వరదరాజులు రెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డి..టీడీపీలోకి వచ్చేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుంది…కడపలో ఈ ముగ్గురు నేతలకు మంచి ఫాలోయింగ్ ఉంది…ఎన్నో ఏళ్ల నుంచి కడప రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు…ఈ ముగ్గురు నేతలు గత ఎన్నికల్లో వైసీపీకి మద్ధతుగా నిలిచారు…అయితే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వీరు..ఆ పార్టీకి దూరం జరిగి…టీడీపీకి దగ్గరయ్యేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే డీఎల్…బహిరంగంగానే వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు…ఈయన గత ఎన్నికల్లో మైదుకూరులో వైసీపీ గెలుపు కోసం కృషి చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక…డీఎల్ రవీంద్రాకు వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు..పైగా జగన్ పాలన నచ్చక…..డీఎల్ బహిరంగంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈయన త్వరలోనే టీడీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అటు వీరశివారెడ్డి…ఇటీవలే నారా లోకేశ్ తో భేటీ అయ్యారు…ఆయన కూడా త్వరలోనే సైకిల్ ఎక్కేలా ఉన్నారు…వరదరాజులు రెడ్డి సైతం మళ్ళీ టీడీపీలోకి వచ్చేందుకు చూస్తున్నారని తెలుస్తోంది…మొత్తం మీద చూసుకుంటే కడపలో సైకిల్ స్పీడ్ పెరిగింది…అయితే జగన్ కంచుకోటలో సైకిల్ స్పీడుకు బ్రేకులు పడవచ్చు..ఎందుకంటే జిల్లా…ఎప్పుడు వైఎస్సార్ ఫ్యామిలీకి అండగా ఉంటుంది..కాబట్టి వైఎస్సార్ ఫ్యాన్స్…కడపలో సైకిల్ స్పీడుకు బ్రేకులు వేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version