Breaking : టిడిపి నేత పట్టాభి అరెస్ట్..

-

విజయవాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు పట్టాభి నీ అదుపులోకి తీసుకున్నారు. పట్టాభి నీ అరెస్టు చేసేందుకు తలుపులు పగల కొట్టి మరి అరెస్టు చేశారు పోలీసులు.

 

అనంతరం కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉన్న పట్టాభి నీ అరెస్టు చేశారు పోలీసులు. మీడియా, కార్యకర్తలను బలవంతంగా బయటకు పంపించి…టీడీపీ నేత పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు చేసిన పట్టాభి ని విజయవాడ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇక అంతకుముందు ఓ వీడియో విడుదల చేసారు టీడీపీ నేత పట్టాభి. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి….వీడియో తేదీ, సమయం కూడా చూపించారు.

తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించిన పట్టాభి…పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అని వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు పట్టాభి అరెస్టు చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version