బాదుడే బాదుడుపై ఇవాళ అసెంబ్లీ వద్ద తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు నిరసనకు దిగారు. ప్రజలపై నిత్యావసరాల ధరల బాదుడు తగ్గించేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ధరలు దిగిరావాలి అంటే జగన్ దిగిపోవాలంటూ టీడీపీ ప్రజా ప్రతినిధుల నినాదాలు చేపట్టారు. ధరల పెరుగుదల ను నిరసిస్తూ అసెంబ్లీకి కాలి నడకన వెళ్ళీంది టీడీపీ ప్రజా ప్రతినిధువ బృందం. ధరలు ఆకాశంలో.. జగన్ ప్యాలస్ లో అంటూ నినాదాలు చేశారు.
చెత్త పై పన్నేసిన చెత్త సిఎం జగన్ అని ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ పై బాదుడే బాదుడు అంటూ నేతల విమర్శించారు. షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఇసుకను బంగారం చేసిన తుగ్లక్ అంటూ నినాదాలు చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఓటిఎస్ పేరుతో పేదల్ని దోచేశారని విమర్శలు గుప్పించారు. ఇంటి పన్ను పెంచి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీఎల్పీ ఉప నేత నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంపై నిత్యావసరాల పెంపు భారం ఉందన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు నిత్యావసరాల పెరుగుదల మోయలేని భారంగా ఉందన్నారు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చామని.. విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ, ఇంధన ధరలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు