టీడీపీ వైపే అందరి చూపు ? ఎవరితో పొత్తంటే ?

-

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలం లేకపోయినా, బలగం మాత్రం బాగానే ఉంది. ఆ బలంతోనే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు ఆ పార్టీ సిద్ధమైపోతుంది. గతంతో పోలిస్తే తెలంగాణ టిడిపికి కాస్త బలం పెరిగిందని, ఆ పార్టీ అంచనా వేస్తోంది. అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రజావ్యతిరేకత ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోవడం వంటివీ తమకు కలిసి వస్తాయనే అంచనాలో టీడీపీ ఉంది. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో టీడీపీ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ లో ఒక్కసారిగా ఇంత ఊపు రావడానికి కారణం ఏంటి అనే విషయంపైనా, టీడీపీ లెక్కలు వేసుకునే పనిలో ఉన్నట్టు గా వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ గ్రేటర్ లో సత్తా చాటుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంటోంది. కనీసం పది స్థానాల్లో అయినా తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవగలం అనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే అధికార పార్టీ టిఆర్ఎస్ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చెందడంతో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉంది ఏదో రకంగా గ్రేటర్ లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసి మళ్లీ తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక బిజెపి దుబ్బాక విజయంతో మంచి జోష్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. తిరిగి గ్రేటర్ ఎన్నికల్లో అంతే స్థాయిలో ప్రభావం చూపించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుండడంతో, ఇక్కడ పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఏదో రకంగా ఇక్కడ విజయం సాధించకపోతే పూర్తిగా పార్టీ తుడిచిపెట్టుకు పోతుంది టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే గ్రేటర్ లో టిడిపికి కాస్త బలం పెరిగింది అనే విషయాన్ని అన్ని పార్టీలు గ్రహించాయి . ఇప్పుడు ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారికి కొన్ని డివిజన్లలో ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని అంచనా వేస్తున్నాయి. అయితే టిడిపి ఈ విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ తో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే బిజెపికి గ్రేటర్ లో మద్దతు ఇవ్వడం కానీ, పరోక్షంగా సహకరించడం ద్వారా కాని , ఆ పార్టీకి దగ్గర అవ్వాలని, అదే సాకుతో ఏపీలోనూ బిజెపితో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో టిడిపి ఉన్నట్లుగా కనిపిస్తోంది. బిజెపి విషయానికి వస్తే గ్రేటర్ లో గెలవడం అత్యవసరం కానున్న నేపథ్యంలో, అవసరమైతే గ్రేటర్ వరకు పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే ఈ విషయం పైన ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version