టీమిండియా స్టార్ ప్లేయర్ పృథ్వి షా ఇన్ స్టాగ్రామ్ స్టోరీపై నేటిజన్లు చర్చిస్తున్నారు. ‘కొంతమంది మనల్ని వాడుకునేంతవరకు ఐ లవ్ యు చెప్తారు. వారికి వచ్చే బెనిఫిట్స్ ఆగిపోతే అక్కడ వారి విధేయత కూడా ముగుస్తుంది’ అని ఇన్ స్టా స్టోరీలో షా పోస్ట్ చేశారు.
దీంతో షాకు ఏమైందని, లవ్ ఫెయిల్యూరా అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నిబ్బా థింగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఓ గ్యాంగ్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ పృథ్వి షా కు వార్ జరిగిన సంగతి తెలిసిందే.