బాక్సింగ్ డే టెస్టులో భారత్ వెనువెంటనే కీలక వికెట్లను కోల్పోయింది. నాలుగో గెస్టులో భారత్ జట్టు తొలుత టాస్ ఓడి బౌలింగ్ చేయగా కంగారు జట్టు భారీ స్కోర్ సాధించి లక్ష్యాన్ని నిర్దేశించింది. తదుపరి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు.
క్రీజులో కుదురుకుని భారీ భాగస్వామ్యం నమోదు చేసిన విరాట్ (36), జైస్వాల్ (82) ఇద్దరూ వెనువెంటనే ఔట్ అయ్యారు. జైస్వాల్ రన్ ఔట్ అవ్వగా.. విరాట్ కోహ్లీ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 154 పరుగుల వద్ద మొత్తం 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగింది. టీమిండియా విజయానికి చాలా దూరంలో ఉన్నది. ఈ మ్యాచ్ డ్రా అవుతుందా? లేదా నాలుగో టెస్టునూ ఇండియా చేజార్చుకుంటుందా? అనేది వేచిచూడాల్సిందే.