నాలుగో టెస్ట్‌లో టీమిండియాకు చ‌క్క‌ని చాన్స్‌.. విజ‌య‌ల‌క్ష్యం 245 ప‌రుగులు..

-

సౌథాంప్ట‌న్‌లో ది రోజ్ బౌల్ వేదిక‌గా ఇంగ్లండ్‌, భార‌త్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ త‌న రెండో ఇన్నింగ్స్ లో 271 పరుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు ఎదుట 245 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 ప‌రుగులు చేయ‌గా, బుమ్రా 3 వికెట్లు, ఇషాంత్ శ‌ర్మ‌, ష‌మీ, అశ్విన్‌లు త‌లా రెండు వికెట్లు తీశారు. అలాగే భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 273 ప‌రుగులు చేసింది. మొయిన్ అలీ 5 వికెట్లు తీశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 271 ప‌రుగులు చేసింది. భార‌త్‌పై 244 ప‌రుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ ఇన్నింగ్స్‌లో ష‌మీ 4 వికెట్లు తీయ‌గా, ఇషాంత్ శ‌ర్మ 2 వికెట్లు తీశాడు. భార‌త జ‌ట్టు రెండో ఇన్నింగ్స్ ను ఇప్పుడే ప్రారంభించింది. ఈ క్ర‌మంలో విజ‌యం కోసం భార‌త్ 245 ప‌రుగులు చేయాల్సి ఉంది.

5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ 2-1 తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇంగ్లండ్ వ‌శ‌మ‌వుతుంది. అదే భార‌త్ గెలిస్తే 2-2తో సిరీస్ స‌మ‌మ‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news