Breaking : బిజెపిలోకి తీన్ మార్ మల్లన్న..!

-

తీన్మార్ మల్లన్న బిజెపిలోకి చేరబోతున్నారు. ఈ విషయాన్ని తీన్ మార్ మల్లన్న కు చెందిన క్యు నెట్ ఛానల్ ప్రసారం చేస్తోంది. మోడీ విధానాలు నచ్చి తీన్ మార్ మల్లన్న బిజెపిలోకి చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం తీన్ మార్ మల్లన్న ఓ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మల్లన్న ను విడిపించేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

మల్లన్న ను విడుదల చేయించాలని మల్లన్న భార్య మమత ప్రధాని మోడీ మరియు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లకు మెయిల్ చేసినట్టు సమాచారం. మోడీ సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యే మల్లన్న బిజెపిలో చేరుతున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ లో కొద్ది రోజులుగా మల్లన్న కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news