తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసిన మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే,

తీన్మార్ మల్లన్న ద్వారా అందరికీ పరిచయం అయిన చింతపండు నవీన్, క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమైన కొన్ని అంశాలపై ప్రియాంక అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే, క్యూ న్యూస్ మాజీ విలేఖరి ప్రవీన్ తో మల్లన్నకు పొరపొచ్చాలున్నాయని, ఆ కారణంగా ప్రవీణ్ పై ఆరోపణలు చేస్తూ క్యూ న్యూస్ లో వార్తా ప్రసారాలు జరిగాయని సమాచారం. దానిలో కొందరు మహిళలతో ప్రవీణ్ దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.

ఈ విషయమై సదరు మహిళ తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్ తనకి మంచి మిత్రుడని, ఒక మహిళ ఫోటోలను చూపిస్తూ, అనవసరమైన ఆరోపణలు చేస్తారా అని పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో క్యూ న్యూస్ ఛానల్ పై దాడి చేసిన పోలీసులు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుని మల్లన్నను అరెస్టు చేసారు. ఈ సమయంలో అటు మల్లన్న అభిమానులు గందరగోళాన్ని సృష్టించారు. పోలీసుల మీదకి రావడంతో రభస జరిగింది.